![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika deepam 2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -609 లో.... కార్తీక్, దీప దశరథ్ బయటకు వస్తారు. దీప కడుపులో బిడ్డని వదులుకోవడమే దీనికి పరిష్కారమని కార్తీక్ అంటాడు. అది పారిజాతం విని షాక్ అవుతుంది. దీప కడుపులో బిడ్డని వదులుకోవడమేంటి.. అంటే బిడ్డకి ఏదైనా సమస్య అయి ఉంటుందా అని పారిజాతం అనుకుంటుంది. ఈ విషయం వెంటనే ఒకరికి చెప్పాలనుకుంటుంది. మరొకవైపు శ్రీధర్ ఆపిల్ కట్ చేసి తినమని స్వప్నకి ఇస్తాడు. ఏంటండీ అల్లుడికి విడాకులు ఇస్తే మందలించకుండా అలా ప్రేమగా ఉన్నారని శ్రీధర్ పై కావేరి కోప్పడుతుంది. కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఏంటి నాన్న నేను చేసిన దానికి కోపం లేదా అని స్వప్న అడుగుతుంది. ఎందుకు కోపంరా నీకు నచ్చింది. నువ్వు చెయ్ ఎప్పుడు ఈ నాన్న నీకు సపోర్ట్ ఉంటాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో ఏది కోల్పోయిన జీవితం కోల్పోవద్దు.. ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదని శ్రీధర్ మాట్లాడతుంటే స్వప్న ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కాంచనకి పారిజాతం ఫోన్ చేసి.. నీ కోడలు కడుపు లో బిడ్డని మోయాలనుకోవడం లేదని చెప్పగానే కాంచన షాక్ అవుతుంది. మీ అన్న, కార్తీక్, దీప మాట్లాడకోవడం నేను విన్నానని పారిజాతం చెప్తుంది. ఇక నీ మనవరాలి గురించి ఆశ వదులుకోవాలని పారిజాతం అంటుంది. ఆ తర్వాత కార్తీక్, దీప ఇంటికి వచ్చి.. రేపు అత్తయ్యతో ఏం చెప్పి హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వాలని మాట్లాడకుంటారు.
ఆ తర్వాత దశరథ్, దాస్ ని కలిసి దీప బిడ్డని వద్దని అనుకుంటున్న విషయం చెప్పి ఏడుస్తాడు. బిడ్డకి ఏం కాదు అన్నయ్య అని దాస్ ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత శ్రీధర్, కాంచన, అనసూయ హాల్లో ఉంటారు. దీప బిడ్డని వద్దనుకుంటుందంట పారిజాతం పిన్ని ఫోన్ చేసిందని కాంచన చెప్పగానే శ్రీధర్, అనసూయ షాక్ అవుతారు. ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నట్లున్నారు.. అందుకే బయటకు రావడం లేదని కాంచన అంటుంది. అప్పుడే కార్తీక్, దీప బ్యాగ్ తో హాల్లోకి వస్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలుసు పారిజాతం పిన్ని అంతా చెప్పిందని కాంచన అనగానే కార్తీక్, దీప షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |